: ఏపీ, టీఎస్ రాష్ట్రాలకు ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేసిన నాబార్డ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నాబార్డ్ ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఏపీ నాబార్డ్ చీఫ్ జీఎంగా జిజి మమ్మెన్ నియమితులయ్యారు. తెలంగాణ నాబార్డ్ చీఫ్ జీఎంగా వీవీవీ సత్యనారాయణను నియమించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ రుణ లక్ష్యం రూ. 14,074 కోట్లని తెలిపింది. అలాగే, 2015-16లో నాబార్డ్ రుణ లక్ష్యం రూ.15,232 కోట్లని తెలిపింది.