: ఎక్కడి నుంచైనా, ఏ రిజిస్ట్రేషన్ అయినా... ఏపీలో 'ఎనీవేర్ రిజిస్ట్రేషన్' విధానం ప్రారంభం


'ఎనీవేర్ రిజిస్ట్రేషన్' విధానాన్ని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. దాంతో ఏపీలో ఎక్కడి నుంచైనా, ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆన్ లైన్ లో చేసుకోవచ్చని మంత్రులు తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో 94,265 దస్తావేజులు ఈ-రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. ప్రజలందరూ ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ను ఉపయోగించుకోవాలని కోరారు. 45 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కు కూడా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దాంతో వినియోగదారులకు చాలా సమయం కలిసొస్తుందని మంత్రులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విధానాన్ని ఆరంభించారు.

  • Loading...

More Telugu News