: పోలీసు ట్రైనింగ్ సెంటర్ భూమిని కబ్జా చేసిన ఆటోడ్రైవర్


ఎవరిదైనా భూమి కబ్జాకు గురైతే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది ఏకంగా పోలీసు ట్రైనింగ్ సెంటర్ భూమే కబ్జాకు గురైతే?... హైదరాబాదులో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాదీలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ కోసం మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, నిబంధనల ప్రకారం విచారణ జరిపి పట్టాలు అందజేస్తామని చెబుతూ జీవో 59 విడుదల చేసింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఫలక్ నుమాకి చెందిన ఆటోడ్రైవర్ ఇబ్రీస్ (56) పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు కేటాయించిన భూమి ప్రహరీని తొలగించి, 300 గజాల స్థలం ఆక్రమించుకున్నాడు. ఈ స్థలం పోలీస్ స్టేషన్ ను ఆనుకుని ఉంది. ఈ స్థలం తనదేని, పట్టా ఇవ్వాలని కోరుతూ, బండ్లగూడ మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రికార్డులు పరిశీలించిన మండల అధికారులు, అది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు కేటాయించిన స్థలంగా నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఇబ్రీస్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, అది కబ్జా చేసినట్టు అంగీకరించాడు. దీంతో అతనిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News