: 30 డాలర్ల బిల్లుకి 1000 డాలర్లు జరిమానా... ఏడాది జైలు శిక్ష
గోరంత విషయాన్ని కొండంతలు చేసి తరువాత తీరిగ్గా విచారిస్తుంటారు కొంత మంది ప్రబుద్ధులు. అమెరికాలోని వాషింగ్టన్ లోని పోస్ట్ ఫాల్స్ ప్రాంతానికి చెందిన ఫిలిప్ అదే ప్రాంతంలో ఉన్న క్లబ్ టెక్కీలా అనే పబ్ కు వెళ్లి అర్థరాత్రి వరకు పీకల్దాకా తాగాడు. అనంతరం 30 డాలర్ల బిల్లు చూసి ఘొల్లుమన్నాడు. ఇంత బిల్లు ఎందుకు వేశారంటూ ఆవేశపడ్డాడు. అంతటితో ఆగకుండా 911 (పోలీస్ కంట్రోల్ రూం నెంబర్)కి ఫోన్ చేశాడు. బార్ వాళ్లు తనను మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ 12 సార్లు ఎమర్జెన్సీ కాల్స్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫిలిప్ పాయిజనీయర్ ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎమర్జెన్సీకి వాడాల్సిన ఫోన్ నెంబర్ ను అనవసర విషయానికి వాడాడంటూ 1000 డాలర్ల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది స్థానిక న్యాయస్థానం. బిల్లు చెల్లించి బయటపడి ఉంటే బాగుండేదని ఫిలిప్ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నాడట.