: ఇదేదో మలేసియా విమానం వ్యవహారంలా ఉందే... సోనియానే కాదు రాహుల్ గాంధీని కూడా గిరిరాజ్ వదల్లేదు!
సోనియా గాంధీ నల్లజాతి మహిళ అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆమెను అధ్యక్షురాలిగా నియమించి ఉండేదా? అందుకు అంగీకరించి ఉండేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఈసారి రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాపై గిరిరాజ్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసినా కూడా ఆయన వైఖరి మారలేదు. తాజాగా రాహుల్ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. సముద్రంలో మునిగిపోయి, ఇప్పటివరకు కనపడకుండాపోయిన మలేషియా విమానంలాగే రాహుల్ గాంధీ ఆచూకీ కూడా తెలియడం లేదని అన్నారు. కాగా, గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరని గత వ్యాఖ్యలు చెబుతున్నాయి.