: 300 మందిని జైలు నుంచి విడిపించుకుపోయిన అల్ ఖైదా


అల్ ఖైదా ఉగ్రవాదులు మరోసారి తమ ప్రతాపం చూపారు. యెమెన్ లోని హద్రామావత్ ప్రావిన్స్ లో ఉన్న ఓ జైలుపై దాడి చేసి.... అందులో ఉన్న 300 మంది ఖైదీలను విడిపించుకుపోయారు. వీరిలో ఆ సంస్థకు చెందిన సీనియర్ లీడర్ ఖలీద్ బటార్ఫీ కూడా ఉన్నాడు. గత నాలుగేళ్ల నుంచి అతను ఈ జైల్లోనే మగ్గుతున్నాడు. అరేబియా ప్రాంతానికి సంబంధించి టాప్ రీజనల్ కమాండర్లలో ఖలీద్ ఒకడు. ఈ సందర్భంగా అల్ ఖైదా ఉగ్రవాదులకు, జైలు సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జైలు గార్డులు చనిపోగా, ఐదుగురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News