: నటి దీపికాపదుకొనె 'మై చాయిస్' వీడియోపై బీజేపీ అగ్రనేత స్పందన


మహిళా సాధికారత నేపథ్యంగా నటి దీపికాపదుకొనె నటించిన 'మై చాయిస్' వీడియోపై బీజేపీ అగ్రనేత, ఎంపీ మురళీ మనోహర్ జోషి స్పందించారు. వీడియోలో తీవ్రస్థాయిలో చైతన్యం లోపించిందని పేర్కొన్నారు. "మనమెంత మార్పుచెందామో తెలుసుకోవడం లేదు. మహిళ అంటే తల్లి అని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కానీ, ఇప్పుడు తల్లి అని పిలవడానికి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి" అని కోల్ కతాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జోషి అన్నారు. "తాను ప్రతిచోట ఉండాలనుకున్న దేవుడు అక్కడ తల్లిని సృష్టించాడు. కానీ అది పాతతరం భావనగా మారింది. ఇప్పుడు నాకో చాయిస్ ఉంది అంటున్నారు. ప్రస్తుతం మనం 'మాకో చాయిస్' (దీపిక వీడియో) ఉంది చూస్తున్నాం. ఇప్పుడు మీరొక శరీరం, ఒక వస్తువు. ఇదే చైతన్యం కోల్పోవడం అంటే" అని జోషీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలంలో ప్రజలు పాశ్చాత్య దేశాల కల్చర్ ను గుడ్డిగా అనుసరిస్తూ, దాని ద్వారా గుర్తింపు పొందాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మన సంప్రదాయాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం అని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News