: రెండు నిమిషాల్లో రైతుల బాధలెలా తెలుస్తాయి?: కేంద్ర బృందంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆగ్రహం


వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వాటిల్లిన నష్టంపై సమగ్ర వివరాలు సేకరిస్తామని రంగంలోకి దిగిన కేంద్ర బృందం తూతూ మంత్రంగానే వివరాలు సేకరిస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం రెండంటే రెండు నిమిషాలు కూడా నిలబడని కేంద్ర బృందానికి రైతుల బాధలెలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి తూతూ మంత్రపు విచారణల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News