: సూర్యాపేట షూటర్లు మావోయిస్టులా?... అనుమానాలు రేకెత్తిస్తున్న ఒడిశా ఓటరు కార్డు!


నల్గొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపైకి కాల్పులకు దిగిన దుండగులు మావోయిస్టులా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతరాత్రి సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్ లో చోటుచేసుకున్న కాల్పుల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగులు పారిపోగా, కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఓటరు ఐడీ కార్డు లభ్యమైంది. కాల్పులకు పాల్పడిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఓటరు ఐడీ కార్డును పరిశీలించిన తర్వాత, కాల్పులకు పాల్పడిన వారు మావోయిస్టులూ అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సదరు ఓటరు ఐడీ కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, దర్యాప్తును ఆ దిశగానూ జరపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News