: ఆరు నెలల్లో తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అయింది?... అందుకు పాటుపడింది నేను కాదా?: బాబు


తెలంగాణకు ధనిక రాష్ట్రంగా గుర్తింపు లభించడం వెనుక తన శ్రమ కూడా దాగి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆరు నెలల్లోనే తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అయిందని ప్రశ్నించారు. తాను గతంలో సీఎంగా వ్యవహరించిన కాలంలో ఎంతో శ్రమించానని, హైదరాబాదుకు ఎన్నో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు తీసుకువచ్చానని తెలిపారు. ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, మెట్రోలను తీసుకువచ్చింది తానేనని అన్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్ను వేయడం సరికాదన్నారు. తెలంగాణకు వచ్చేవారిపై పన్ను వేస్తే వారికే నష్టమని హితవు పలికారు. విభజన చట్టంలోని అన్ని అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం మధ్యవర్తిత్వం కోరదామని అన్నారు. ఇరు రాష్ట్రాలు గొడవపడితే నష్టపోతామని చెప్పారు. కూర్చుని మాట్లాడుకుందాం రమ్మంటే తెలంగాణ సర్కారే ముందుకు రావడంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News