: ఎవరెన్ని చెప్పినా రైతులు వినలేదు... సహకరించారు: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో రాజధాని గురించి మాట్లాడారు. భూసేకరణ సందర్భంగా రైతులు ఎంతో సహకరించారని కొనియాడారు. వారి సహకారం మరువలేనిదన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఎవరెన్ని చెప్పినా వారు వినకుండా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వారిచ్చిన భూమిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి వారికే తిరిగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. విదేశీ సంస్థలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, భూముల విలువ కూడా పెరుగుతుందని అన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని ఉద్ఘాటించారు. పేదలకు అనుకూలంగా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకువచ్చిందన్నారు. మే 15 లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ అందుతుందని, ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తామని అన్నారు. రాజధానిని రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తామని చెప్పారు. విజయవాడు-గుంటూరులను కలుపుతూ 200 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, జాతీయ రహదారులకు అనుసంధానంగా రింగ్ రోడ్డు ఉంటుందని వివరించారు. ప్లాన్ లో భాగంగా కృష్ణానదిపై 5 వంతెనలు నిర్మిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News