: పార్టీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో మధురపూడి (రాజమండ్రి) వెళ్లిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదుగా ఇర్రిపాక వెళ్లారు. నెహ్రూ కుటుంబసభ్యులందరితో మాట్లాడిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. ఆయనతో పాటు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు కూడా నెహ్రూను, కుటుంబాన్ని పరామర్శించారు.