: ఇక లోకేశ్ పరామర్శ యాత్ర... రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విని గుండె పగిలిన వారిని ఓదార్చేందుకంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరిట సుదీర్ఘ పర్యటన చేస్తే, తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ పరామర్శ యాత్ర చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నెల 12న ఏపీలో ప్రారంభం కానున్న పరామర్శ యాత్రలో లోకేశ్, 50 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు పరామర్శతో పాటు రూ.2 లక్షల మేర ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన అందిస్తారట. తెలంగాణలో పరామర్శ యాత్ర షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.