: అమిత్ షాపై టెర్రరిస్టుల గురి... పాట్నాలో దాడికి పన్నాగం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఉగ్రవాదులు గురిపెట్టారు. అంతేగాక, ఆయనను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. అయితే, ఆ ప్లాన్ పారలేదు కాని ఉగ్రవాదులు మాత్రం పోలీసులకు చిక్కారు. 2014 ఏప్రిల్ 14న పాట్నాలో ర్యాలీకి హాజరైన అమిత్ షాను కడతేర్చేందుకు ఉగ్రవాదులు రెండు బాంబులను పెట్టారు. సరిగ్గా అమిత్ షా ర్యాలీ జరిగే సమయంలోనే అవి పేలేలా ఉగ్రవాదులు ప్లాన్ వేశారు. అయితే, నాడు అనుకోని కారణాల వల్ల ఆ బాంబులు పేలలేదు. అమిత్ షా క్షేమంగానే బయటపడ్డారు. ఇటీవల అరెస్టైన ముగ్గురు తీవ్రవాదులను విచారించిన సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని వెలికితీశారు. అంతేగాక, అమిత్ షా లక్ష్యంగా పెట్టిన రెండు బాంబులను కూడా వెలికితీసి నిర్వీర్యం చేశారు. 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీని అంతమొందించేందుకు పెట్టిన బాంబుల్లో వాడిన పేలుడు పదార్థాలే పాట్నాలో వెలుగుచూసిన ఈ బాంబుల్లోనూ ఉన్నాయట.