: మన్మోహన్ కు ఊరట... సీబీఐ సమన్లపై సుప్రీం స్టే


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. బొగ్గు కుంభకోణంలో ఆయనకు సీబీఐ జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిసినా, ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ, ఇటీవలే మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీ చేసింది. సీబీఐ జారీ చేసిన సమన్లపై మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మన్మోహన్ పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం వాటిపై స్టే విధిస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక మన్మోహన్ కు సమన్లు జారీ చేసిన విషయంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News