: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, అదేవిధంగా లీటరు డీజిల్ పై రూ.1. 21పైసలు తగ్గింది. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ క్రమంలో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.60, డీజిల్ ధర రూ.48.50 పలుకుతోంది.