: రవాణా పన్నుపై హైకోర్టులో ట్రావెల్స్ యాజమాన్యాల పిటిషన్
తెలంగాణ రాష్ట్రం విధించిన అంతర్ రాష్ట్ర రవాణా పన్నును సవాల్ చేస్తూ ఏపీ ట్రావెల్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు ట్రావెల్స్ యాజమాన్యాలు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశాయి. దాంతోపాటు మరో రెండు వేరు వేరు పిటిషన్ లు కూడా దాఖలయ్యాయి. వాటిపై ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. గత అర్థరాత్రి నుంచి తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో లారీ యాజమాన్యాలు, ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.