: దేవుడి ప్రసాదం కూడా వికటించింది... ఆదిలాబాదు జిల్లాలో మహిళ మృతి
తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి కలుషితమవుతున్న కారణంగా మనం ఇబ్బందిపడుతున్నాం. కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా దేవుడి ప్రసాదం కూడా కలుషితమైంది. కలుషితమైన దేవుడి ప్రసాదం తిని ఓ మహిళ మృత్యువాత పడింది. ఆదిలాబాదు జిల్లా జైనత్ మండలం గిమ్మా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో పెట్టిన ప్రసాదాన్ని తిన్న లక్ష్మి అనే మహిళ చనిపోగా, ఆమె కూతురు శివానీ (3), మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆలయ ప్రసాదం తిన్నవారిలో లక్ష్మి సహా 12 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆదిలాబాదు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.