: ఎవరెస్ట్ పై స్వచ్ఛ భారత్... పర్వతారోహకులు విడిచిన వ్యర్థాల తొలగింపునకు సైన్యం చర్యలు


ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఎవరెస్ట్ శిఖరాన్నీ చేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించే క్రమంలో పర్వతారోహకులు దాదాపు 4 వేల కిలోల ఘన వ్యర్ధాలను అక్కడ వదిలేసి వచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీటిని అక్కడి నుంచి తొలగించేందుకు భారత సైన్యం నడుం బిగించింది. 34 మంది పర్వతారోహకులతో కూడిన భారత సైనిక బృందం నేపాల్ మీదుగా ఎవరెస్ట్ చేరుకునేందుకు బయలుదేరింది. ఎవరెస్ట్ పై ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడమే కాక ఎవరెస్ట్ మార్గంలో పడిన వ్యర్థాలను కూడా తొలగించనుంది.

  • Loading...

More Telugu News