: ఆపరేషన్ 'రాహత్' కు యెమెన్ చేరుకున్న భారత నౌక


ఆపరేషన్ 'రాహత్' కోసం భారతీయ నౌక యెమెన్ తీరానికి చేరుకుంది. అంతర్యుద్ధం నేపథ్యంలో యెమెన్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, భారత్ హై ఎలర్ట్ ప్రకటించింది. యెమెన్ లో ఉంటున్న భారతీయులంతా తక్షణం స్వదేశం రావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, భారతీయులు స్వదేశానికి తరలేందుకు తగిన విమాన సౌకర్యాలు లేకపోవడానికి తోడు, కొంతమంది ఆర్థిక పరిస్థితి విమానాల్లో స్వదేశం చేరేందుకు సహకరించకపోవడంతో భారతీయులను స్వదేశం చేర్చే బాధ్యతను కేంద్రం భుజానవేసుకుంది. దీంతో, ఒక నౌకను యెమెన్ కు పంపించింది. ఈ తరలింపు కార్యక్రమానికి 'ఆపరేషన్ రాహత్' అని పేరు పెట్టింది. ఈ నౌక యెమెన్ తీరానికి చేరింది. అనుమతులు మంజూరైన వెంటనే యెమెన్ లో భారత ఎంబసీ ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చనుంది. యెమెన్ లో కేరళ నర్సులు అధికంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News