: సినిమాల్లో ఉండే గొప్పదనం అదే: అమితాబ్ బచ్చన్


సినిమా అందర్నీ ఏకతాటిపైకి తీసుకువస్తుందని బాలీవుడ్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ అన్నారు. 'ఇండియా బై ద నైల్' కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు ఆయన ఈజిప్ట్ రాజధాని కైరోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీకట్లో ఉన్న సినిమా థియేటర్లో మనం ప్రవేశించినప్పడు మన పక్కన కూర్చున్న వారి కులం, మతం, జాతి, రంగు ఇవేవీ అడగమని, కేవలం సినిమాను మాత్రమే ఆస్వాదిస్తామని అన్నారు. సినిమాలో పాటల్నే అంతా పాడుకుంటాం, సినిమాలోని భావోద్వేగాలను మనవిగా భావిస్తాం, ఒకేలా స్పందిస్తాం అని ఆయన చెప్పారు. హాస్య సన్నివేశాలకు అంతా ఒకేలా నవ్వుతామని ఆయన గుర్తుచేశారు. సినిమా షూటింగ్ నిమిత్తం తొలిసారి 1975లో ఈజిప్టు వచ్చానని ఆయన వెల్లడించారు. అప్పుడు భారతీయ సినిమాల గురించి ఇక్కడి వారికి పెద్దగా తెలియదని తెలిపారు. 1991లో జరిగిన ఈజిప్టు ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూసి ఆశ్చర్యమేసిందని వివరించారు. "అదీ... సినిమాకు ఉన్న శక్తి!" అని బిగ్ బి తెలిపారు.

  • Loading...

More Telugu News