: బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్: భట్టి
బయ్యారం గనుల్లో లభ్యమైన ఖనిజాన్ని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. దాంతో పాటు ఉక్కు శుద్ధి కర్మాగారాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ, బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. దీనిపై టీఆర్ఎస్, టీడీపీ నానాయాగీ చేస్తున్నాయని విమర్శించారు.