: కడప జిల్లాలో సీరియల్ షూటింగ్ లో విషాదం


బుల్లితెర సీరియల్ షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏపీలోని కడప జిల్లా నందలూరులో ఉన్న ఆల్విన్ కంపెనీలో ఓ సీరియల్ షూటింగ్ విషాదాంతమైంది. షూటింగ్ సందర్బంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట్ అనే జూనియర్ ఆర్టిస్టు దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News