: తెలంగాణలో అడుగుపెట్టే ఏపీ వాహనాల పన్నులివే...!


అంతర్రాష్ట్ర రవాణా ట్యాక్స్ లను తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. నేటి అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ వాహనాలకు కూడా అంతర్రాష్ట్ర ట్యాక్స్ లను వసూలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణలో అడుగుపెట్టే ఆంధ్రప్రదేశ్ వాహనాలు చెల్లించాల్సిన ట్యాక్సుల వివరాలు... హెవీ వెహికల్స్ కు రూ.2970 నుంచి రూ.5740 వరకు వసూలు చేయనున్నారు. అలాగే మీడియం వెహికల్స్ కు రూ.1950 నుంచి రూ.2440 వరకు వసూలు చేయనున్నారు. లైట్ మోటారు వెహికల్స్ కు రూ.430 నుంచి రూ. 1280 వరకు చేయనున్నారు. ఆలిండియా మ్యాక్సీ క్యాబ్ కు సీటుకు 1300 రూపాయలు వసూలు చేస్తారు. ఇలా వసూలు చేయడం ద్వారా మూడు నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ వాహనాల నుంచి 70 నుంచి 80 కోట్ల రూపాయలు పన్నుల రూపేణ వస్తాయని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు. రవాణా శాఖలో మూడు నెలలకోసారి పన్ను వసూలు చేసే అవకాశం ఉండడంతో రేపు ఏపీ వాహనాలకు పన్నులు కట్టుకోవాలని వారు సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకే తాము పన్నులు విధించామని తెలంగాణ రవాణా శాఖాధికారులు తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి కానందున ఏపీఎస్ఆర్టీసీ బస్సుల నుంచి పన్నుల వసూలుకు సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News