: నగల వ్యాపారంలో అడుగుపెడుతున్న తమన్నా


ప్రముఖ సినీ నటి తమన్నా డిజైనర్ అవతారం ఎత్తింది. తమన్నా స్వయంగా డిజైన్ చేసిన వజ్రాల నగలను తండ్రి సంతోష్ భాటియాతో కలిసి ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు సాగించనుంది. ఏప్రిల్ లో ప్రారంభం కానున్న తన వ్యాపార సంస్థ 'వైట్ అండ్ గోల్డ్' లోగోను హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో తమ్మూ బేబీ ఆవిష్కరించింది. చిన్నప్పటి నుంచి తనకు నగలంటే ఇష్టమని, పలు దేశాల్లో తాను చూసిన డిజైనర్ నగలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డిజైన్లు రూపొందించానని, అవి వినియోగదారులను అలరిస్తాయని తమన్నా విశ్వాసం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో నటిస్తున్నప్పటికీ తన ప్రాధాన్యం మాత్రం తెలుగుకేనని తమన్నా స్పష్టం చేసింది. 'బాహుబలి'లో నటించడం తన అదృష్టం అని పేర్కొన్న తమన్నా, ప్రస్తుతం కార్తీ, నాగార్జున సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News