: మ్యాక్స్ వెల్, ఫాల్కనర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్


ఒక్క సిరీస్ లో విజయవంతమైతే ఆ ఆటగాళ్లకు టీమిండియా రెడ్ కార్పెట్ పరుస్తుంది. అదే వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ప్రతిభ చాటితే మరోవరల్డ్ కప్ వరకు వారి స్థానానికి ఢోకా లేనట్టే. ఏవో కొన్ని సిరీస్ లలో రాణించిన రవీంద్ర జడేజాను అలాగే ఎంపిక చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, ఈ విషయంలో బీసీసీఐకి తాము పూర్తి భిన్నమని క్రికెట్ ఆస్ట్రేలియా నిరూపించింది. వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో ప్రతిభ చూపిన గ్లెన్ మ్యాక్స్ వెల్, జేమ్స్ ఫాల్కనర్ లను జట్టునుంచి తప్పించింది. జూన్ 5 నుంచి వెస్టిండీస్ తో ప్రారంభమయ్యే సిరీస్, అనంతరం జరిగే యాషెస్ సిరీస్ కు వీరిద్దరినీ ఎంపిక చేయలేదు. వీరి స్థానంలో ఫవద్ అహ్మద్, ఆడమ్ వోగ్స్, పీటర్ నెవిల్ ను ఎంపిక చేసింది. తాజా విదేశీ పర్యటనకు 17 మంది సభ్యులు గల జట్టును సీఏ ప్రకటించింది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో 'యాషెస్ సిరీస్' ప్రారంభం కానుంది. ర్యాన్ హారిస్ ను 'యాషెస్ సిరీస్' కు మాత్రమే ఎంపిక చేశారు. మ్యాక్స్ వెల్ వరల్డ్ కప్ లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్ మన్ గా నిలవడం విశేషం. ఫాల్కనర్ ఫైనల్లో కీలకమైన 3 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News