: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కివీస్ స్పిన్ దిగ్గజం


న్యూజిలాండ్ క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన స్టార్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో కివీస్ జట్టు ఓటమి పాలైన నేపథ్యంలో, వెటోరీ రిటైర్మెంట్ నిర్ణయం టీమ్ మేట్స్, అభిమానులను బాధించేదే. కప్ విజయంతో వెటోరీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని సహచరులు భావించినా, మెల్బోర్న్ మైదానంలో ఏదీ అనుకూలించలేదు. ఆ మ్యాచ్ అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన వెటోరీ ఆక్లాండ్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. న్యూజిలాండ్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం నిర్ధారణ అయింది. అటు, ఐసీసీ కూడా వెటోరీ వీడ్కోలు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 36 ఏళ్ల వెటోరీ తన కెరీర్లో 113 టెస్టులాడి 362 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 7/87. బ్యాటింగ్ లోనూ వెటోరీ తక్కువేమీ కాదు. 30 సగటుతో 4,531 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిలో 6 సెంచరీలు, 23 అర్థసెంచరీలున్నాయి. వన్డేల విషయానికొస్తే 295 మ్యాచ్ లలో 305 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/7. 2,253 పరుగులు సాధించాడు. వాటిలో 4 అర్థసెంచరీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News