: కేసీఆర్ కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: సీపీఐ రామకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కావాలనే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బందుల పాలుచేసే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తీరుపై గవర్నర్ ను కలుస్తామని ఆయన చెప్పారు. ఏపీ వాహనాలకు అంతర్రాష్ట్ర పన్ను విధించడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. రాజధానికి వెళ్లేందుకు పన్ను కట్టాల్సిరావడం ఏంటని ఆయన నిలదీశారు.