: అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వ్యక్తి పట్టిసీమపై విమర్శలు చేస్తారా?: జగన్ పై సోమిరెడ్డి ఫైర్
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ బృందం మొత్తం దారిదోపిడీ దొంగల ముఠాలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సంస్థల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి... పట్టిసీమపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. పట్టిసీమ గొప్ప ప్రాజెక్ట్ అని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని, కేవలం సముద్రానికే నష్టమని చెప్పారు. కేసుల నుంచి క్లీన్ గా బయటపడిన తర్వాత... రాజకీయ పార్టీ వ్యక్తిగా కొనసాగితే బాగుంటుందని జగన్ కు సోమిరెడ్డి సలహా ఇచ్చారు.