: జేసీ దివాకర్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్... సింగపూర్ నుంచి తాను రాగానే వచ్చి కలవాలంటూ హుకుం జారీ


అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు గండికొట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. తాను సింగపూర్ నుంచి రాగానే తనను కలవాలని జేసీకి హుకుం జారీ చేశారు. నిన్న జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల ఆధ్వర్యంలో రైతులు కెనాల్ కు గండి కొట్టారు. ప్రజల తాగునీటి కోసమే ఈ పని చేశామని, ఈ సందర్భంగా జేసీ తెలిపారు. దీన్ని నిరసిస్తూ జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా రైతులు కెనాల్ కు గండి కొట్టిన ప్రాంతానికి బయలుదేరారు. వారు వస్తున్నారన్న వార్త తెలుసుకున్న అనంతపురం జిల్లా రైతులు భారీ సంఖ్యలో కెనాల్ వద్దకు చేరుకున్నారు. దీంతో, ఇరువర్గాలు ఒకే ప్రాంతంలో కలిస్తే పెద్ద గొడవకు దారితీస్తుందని భావించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వివేకాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సింగపూర్ లో ఉన్న చంద్రబాబుకు తెలియడంతో, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇలాంటి ఘటనలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతాయని, ఇలాంటి వాటికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News