: గ్రేటర్ ఎన్నికలపై సర్కారు కుంటి సాకులు చెబుతోంది: బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ సర్కారు కుంటి సాకులు చెబుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలతోనూ సర్కారుకు బుద్ధి రాలేదని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు ముందు హైకోర్టు ఆదేశాలతో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కేవలం నెల వ్యవధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలంటేనే టీఆర్ఎస్ భయపడుతోందని ఆయన అన్నారు.