: నటుడు శివాజీకి బీజేపీతో సంబంధం లేదు: బీజేపీ నేత సోము వీర్రాజు


సినీ నటుడు, ఇటీవల ఏపీ ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేస్తున్న శివాజీకి బీజేపీతో సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఏపీకి రూ.7వేల కోట్లు మంజూరు చేశామన్నారు. కానీ ప్రత్యేక హోదా కోరుతున్న పలు రాష్ట్రాలకు మాత్రం రూ.3వేల కోట్లు మాత్రమే ఇచ్చామని వీర్రాజు తెలిపారు. ఇలా ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ఏపీకి అందేలా చేస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ డిమాండ్ చేయకముందే 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, దాన్ని మరవొద్దని చెప్పారు. విభజనచట్టంలో లేని ఎన్నో ప్రాజెక్టులను ఏపీకి ఇచ్చామని, చట్టంలో ఉన్న ప్రాజెక్టులను కూడా ఇస్తున్నామని ఆన్నారు. ఇవన్నీ టీడీపీని సంతృప్తి పరచడానికి కాదని, తమ (బీజేపీ) బాధ్యతను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకాకపోయినా తాము బజారున పడటం లేదన్న వీర్రాజు, సంకీర్ణ మిత్రధర్మం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగని తెలుగుదేశం తప్పులు చేస్తే సమర్థించబోమన్నారు.

  • Loading...

More Telugu News