: వ్యూహాత్మక సంబంధాలపై అమెరికా వర్సిటీలో కవిత ప్రసంగం... నేడు న్యూజెర్సీకి పయనం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్ఠాత్మక వర్సిటీ ప్రిన్స్ టన్ లో ఆమె ప్రసంగించనున్నారు. ఇందుకోసం నేటి సాయంత్రం ఆమె అమెరికా బయలుదేరుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి 9 దాకా ప్రిన్స్ టన్ వర్సిటీలో ‘‘అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలు’’ అనే అంశంపై సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ భారత్ కు చెందిన ఐదుగురు పార్లమెంటు సభ్యులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కవిత ఒక్కరికే ఈ అవకాశం దక్కింది. ఆమెతో పాటు ఎంపీలు పూనమ్ మహాజన్, గౌరవ్ గొగోయ్, కీర్తి ఆజాద్, యశ్వంత్ సింగ్ లు కూడా ఈ సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు.