: భూసేకరణ బిల్లును కావాలనే అడ్డుకుంటున్నాయి: వెంకయ్యనాయుడు
భూసేకరణ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. జార్ఖండ్ లో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో పసలేదని అన్నారు. బిల్లులో ప్రతిపక్షాలు సూచించిన తొమ్మిది సవరణలు చేశామని, వారి అనుమానాలు కూడా నివృత్తి చేశామని ఆయన చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు భూసేకరణ బిల్లుకు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. భూసేకరణ బిల్లు వల్ల రైతులకు లాభం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.