: రూ. 500 కోట్లతో పెన్ గంగ బ్యారేజీని నిర్మించనున్న టీఎస్ ప్రభుత్వం


ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అకోలి వద్ద పెన్ గంగా నదిపై తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని నిర్మించబోతోంది. బ్యారేజీ సర్వే పనులను రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్, తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 500 కోట్లతో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే, 20 వేల హెక్టార్లకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News