: ఆస్ట్రేలియా అధికారుల పొరపాటుతో అంతర్జాతీయ నేతల వివరాలు బహిర్గతం


ఆస్ట్రేలియా అధికారులు చేసిన పొరపాటుతో పలువురు దేశాధినేతల ప్రయాణ వివరాలతోపాటు, వారి వ్యక్తిగత వివరాలు కూడా బహిర్గతమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జీ20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆస్ట్రేలియా అధికారుల పొరపాటు కారణంగా దేశాధినేతల డేటా ఇంటర్నెట్ లో బహిర్గతమైంది. లీకైన వాటిలో ఆ నాయకుల పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, వారి ప్రయాణ వివరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోల వివరాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News