: డోంట్ వర్రీ... పార్టీలో అంతా బాగానే ఉంది: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు రచ్చకెక్కడం... ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను బహిష్కరించడంతో పార్టీ కార్యకర్తల్లో, మీడియాలో పలు అభిప్రాయాలు, అనుమానాలు నెలకొన్నాయి. వాటిన్నింటినీ తొలగించేందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారు. పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. "బాధపడాల్సిన అవసరం లేదు. పార్టీలో అంతా బాగానే ఉంది. మేమంతా చక్కగా మేనేజ్ చేసుకుంటాం" అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ కమిటీ నుంచి భూషణ్ ను తొలగించడం, కొత్త సభ్యులతో అంతర్గత లోక్ పాల్ ఏర్పాటు చేయడం, అడ్మిరల్ రాందాస్ కు అంతర్గత లోక్ పాల్ నుంచి ఉద్వాసన పలకడం వంటి తదితర చర్యలు తీసుకుంది.