: గతంలో నేనూ జైలు జీవితం గడిపా: హోం మంత్రి నాయిని
ఖైదీల సమస్యలు తనకు తెలుసని... ఎందుకంటే, తాను కూడా జైలు జీవితం గడిపిన వాడినే అని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన చంచల్ గూడ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమర్జన్సీ కాలంలో 18 నెలలు జైలులో ఉన్నానని... తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం తాను జైలుకు వెళ్లానని చెప్పారు. ముషీరాబాద్ జైలుకు 50 నుంచి 60 సార్లు వెళ్లుంటానని వెల్లడించారు. జైళ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేలా జైళ్లు ఉండాలని అన్నారు.