: కోహ్లీ, అనుష్కల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి: టీమిండియా అభిమానులకు యువీ సూచన


వరల్డ్ కప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనకు అతడి ప్రియురాలు అనుష్క శర్మే కారణమని సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. కోహ్లీ, అనుష్కల వ్యక్తిగత జీవితాన్ని అభిమానులు గౌరవించాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ రాణించిన విషయాన్ని ఫ్యాన్స్ గుర్తెరగాలని అన్నాడు. కోహ్లీ త్వరలోనే ఫామ్ దొరకబుచ్చుకుంటాడని, భారత్ కు విజయాలు అందిస్తాడని యువీ ధీమా వ్యక్తం చేశాడు. సిడ్నీలో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరగడం తెలిసిందే. దీంతో, మ్యాచ్ చూసేందుకు అనుష్క రావడంతోనే కోహ్లీ సరిగా ఆడలేకపోయాడని విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. నటి అనుష్క శర్మకు ఈ విషయంలో బాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖులు కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News