: ట్విట్టర్ లో మోదీని అధిగమించిన షారుఖ్
సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అభిమానగణం మరింత పెరిగింది. రెండు రోజుల (శనివారం) క్రితం ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 12 మిలియన్ల (కోటి 20 లక్షలు)కు చేరుకుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని... కింగ్ ఖాన్ అధిగమించాడు. మోదీని ప్రస్తుతం 11.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. దాంతో, ప్రధానికన్నా ఈ బాలీవుడ్ నటుడు ముందున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. మరోవైపు, 13.9 మిలియన్ల అభిమానగణంతో వారిద్దరికన్నా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందు వరుసలో ఉన్నారు.