: గంగిరెడ్డి ఆస్తుల స్వాధీనానికి చట్టాన్ని సవరించాలి: డీజీపీ రాముడు
విదేశీ పోలీసుల అదుపులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై ఏపీ డీజీపీ రాముడు మాట్లాడారు. గంగిరెడ్డి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటే చట్టాన్ని సవరించాలని చెప్పారు. దానికింకా సమయం పడుతుందని, ఇప్పట్లో తేలే విషయం కాదన్నారు. కడప, కర్నూలు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందన్న ఆయన, ఏపీ మావోల ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు. కానీ నకిలీ మావోల ఎక్కువయ్యారన్నారు.