: గవర్నర్ నరసింహన్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం !
టికెట్ కొనుక్కొని చెక్ ఇన్ అయిన ఒక ప్రయాణికుడు లగేజీని విమానంలో ఎక్కించి తాను ఎక్కక పోవడంతో, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కలకలం చెలరేగింది. ఇదే విమానంలో గవర్నర్ నరసింహన్ ప్రయాణిస్తుండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. విమానం బయలుదేరే ముందు విషయాన్ని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. చెక్ ఇన్ అయిన తర్వాత ప్రయాణికుడు ఎందుకు ఎక్కలేదన్న దానిపై ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. అతని లగేజీలో ఏముందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.