: హస్తినకు గవర్నర్... మూడు రోజుల పాటు అక్కడే మకాం!
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆయన కేంద్రానికి వేర్వేరుగా నివేదికలు అందజేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా బలం పుంజుకుంటున్న మావోయిస్టులపైనా ఆయన కేంద్ర హోం శాఖకు నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది.