: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ను గెలుచుకున్న సైనా నెహ్వాల్


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ ఫైనల్ లో థాయ్ లాండ్ షట్లర్ రచనోక్ ఇంటనాన్ పై 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. దాంతో తన కెరీర్ లో 16వ టైటిట్ లను సాధించిన సైనా, కెరీర్ లో తొమ్మిదొవ సూపర్ సిరీస్ ను దక్కించుకుంది. ఇండియన్ ఓపెన్ ను సైనా గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటికే బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన సైనాకు ఇది మరో అద్భుత విజయం.

  • Loading...

More Telugu News