: ఆసీస్-కివీస్ ఫైనల్ మ్యాచ్ కు రికార్డు స్థాయిలో అభిమానుల హాజరు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియానికి అభిమానులు రికార్డు స్థాయిలో వచ్చారు. దాదాపు 93,013 మందితో స్టేడియం కిక్కిరిసిపోయింది. క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా అత్యధికమంది చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇదే స్టేడియంలో 15 నెలల కిందట తొలిరోజు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ను 91,112 మంది చూశారు. ఈరోజు జరిగిన మ్యాచ్ కు హాజరైన సంఖ్యతో ఆ పాతది తుడిచిపెట్టుకుపోయింది. ఇక వన్డే క్రికెట్లో పాకిస్థాన్-ఇంగ్లండ్ ల మధ్య 1992లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను ఇదే స్టేడియంలో 87,192 మంది తిలకించారట. అదే మరి, క్రికెట్ మ్యాచా... మజాకానా!