: ఫిలిప్ హ్యూస్ కు ఆసీస్ ప్రపంచకప్ అంకితం
గతేడాది మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు ప్రపంచ కప్ ను ఆసీస్ జట్టు అంకితమిచ్చింది. న్యూజిలాండ్ పై గెలిచిన అనంతరం కప్ అందుకున్న కెప్టెన్ మైకేల్ క్లార్క్, ఈ కప్ ను తన లిటిల్ బ్రదర్ హ్యూస్ కు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ టోర్నీలో 'పీహెచ్' ఉన్న ఆర్మ్ బ్యాండ్ ధరించిన క్లార్క్, తానెప్పుడు ఆసీస్ తరపున ఆడినా దానిని ధరిస్తానని ఉద్వేగంగా చెప్పాడు. హ్యూస్ మృతి తరువాత కాలం తమకు చాలా క్లిష్టమైనదని పేర్కొన్నారు. దేశవాళీ మ్యాచ్ సందర్భంగా బౌన్సర్ వచ్చి హ్యూస్ తలకు తీవ్రంగా తగలడంతో నవంబర్ లో చనిపోయాడు.