: న్యూజిలాండ్ ఆలౌట్... ఆస్ట్రేలియా విజయలక్ష్యం 184
ఇల్లియాట్ చేసిన 83, టేలర్ చేసిన 40 పరుగులు మినహా మరెవ్వరూ రాణించలేక పోవడంతో న్యూజిలాండ్ జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 45 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. హార్డ్ హిట్టర్లుగా పేరున్న మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచీ, హెన్రీలు డక్కౌట్ అయి అభిమానులను తీవ్ర నిరాశ పరిచారు. గుప్టిల్ 15, విలియంసన్ 12, వెటోరీ 9, సౌతీ 11 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టు బౌలర్లలో జాన్సన్, ఫాల్కనర్ లు చెరో 3 వికెట్లు, స్టార్క్ 2, మాక్స్ వెల్ 1 వికెట్ తీశారు. మరికాసేపట్లో 184 పరుగుల సునాయాస విజయలక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.