: తడబడ్డ టాప్ ఆర్డర్... 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్


తొలిసారి వరల్డ్ కప్ గెలవాలన్న ఆశతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ప్రదర్శన ఆశించినంత గొప్పగా లేదు. ఇరగదీస్తాడనుకున్న మెక్ డక్కౌట్ కాగా, స్టార్ బ్యాట్స్ మెన్ గుప్టిల్ 15 పరుగుల వద్ద (34 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మాక్స్ వెల్ బౌలింగ్ లో బౌల్డ్ కాగా, విలియంసన్ 12 పరుగుల వద్ద (33 బంతుల్లో 1 ఫోర్) జాన్సన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం టేలర్ 7, ఇల్లియాట్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ స్కోర్ 14 ఓవర్లలో 41/3.

  • Loading...

More Telugu News