: నిదానంగా సాగుతోంది... 10 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 31/1
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పోరులో గెలిచి తొలి వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భావిస్తున్న న్యూజిలాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. తొలి ఓవర్ లోనే కీలకమైన మెక్ కల్లమ్ వికెట్ కోల్పోయిన తరువాత గుప్టిల్, విలియంసన్ లు నిదానంగా స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో 10 ఓవర్లలో న్యూజిలాండ్ 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుప్టిల్ 14, విలియంసన్ 11 పరుగులతో ఆడుతున్నారు.