: కెమెరా ముందు నటించు... వెనక వద్దు!: హేమకు శివాజీ రాజా కౌంటర్


కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని సినీ నటి హేమకు నటుడు శివాజీ రాజా కౌంటర్ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా నిలిచేందుకు ఛాంబరుకు వచ్చానని చెప్పిన ఆయన, హేమ తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. మాట్లాడేటప్పుడు నియంత్రణలో ఉండాలని సూచించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయాల్సిన అవసరం ఆమెకు ఏముందని ప్రశ్నించారు. ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై ఉండదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News